
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. క్లాస్ రూమ్ లో పాపను మరిచిపోయి, స్కూల్ కు తాళం వేసి వెళ్లిపోయారు సిబ్బంది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. స్థానిక బ్రిలియంట్ స్కూల్ క్లాస్ రూమ్ లో.. ముత్తునూర్ గ్రామానికి చెందిన 3సవంత్సరాల ప్రవర్శిని అనే పాప ఉండగానే, స్కూల్ కు తాళం వేసి వెళ్ళిపోయారు సిబ్బంది.
పాప ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. స్కూల్ కు ఫోన్ చేశారు. అయితే పాపా ఎప్పుడో ఇంటికి వెళ్లిందని యాజమాన్యం సమాధానమిచ్చింది. దీంతో ముత్తునూర్ గ్రామ సర్పంచ్ కు ఫోన్ ద్వారా విషయం తెలిపారు తల్లిదండ్రులు.అనుమానం వచ్చిన సర్పంచ్ వెంటనే స్కూల్ గేట్ తీయించి చూడగా.. క్లాస్ రూంలో పాప ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయి ఉంది. దీంతో సిబ్బందిని మందలించి పాపను ఇంటికి తీసుకెళ్ళారు. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు గ్రామస్తులు.