ఇక బిల్డింగ్లకు పెయింటర్లు కాదు ఏఐ రోబోలు రంగులేస్తయ్..! అద్దాలు కూడా క్లీన్ చేస్తయ్..!

ఇక బిల్డింగ్లకు పెయింటర్లు కాదు ఏఐ రోబోలు రంగులేస్తయ్..! అద్దాలు కూడా క్లీన్ చేస్తయ్..!

ఎత్తైన భవనాలకు రంగులు వేయడం, వాటి అద్దాలను క్లీన్​ చేయడం చాలా రిస్క్‌‌తో కూడిన పని. అందుకోసం కార్మికులు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ.. అలాంటి పనులను సులభంగా పూర్తి చేసేందుకు చెన్నైకి చెందిన ముగ్గురు ఫ్రెండ్స్​ ఒక ఏఐ రోబోని తీసుకురాబోతున్నారు. అది బిల్డింగ్​లకు రంగులు వేయడమే కాదు.. మనిషి సాయం లేకుండా అద్దాలను శుభ్రం చేస్తుంది. 

దినేష్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), వేల్​మురుగన్ (చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్), కేశవరాజ్ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) కలిసి ‘వివిడోబాట్స్’ అనే స్టార్టప్​ పెట్టి, ఏఐ రోబోని తయారుచేస్తున్నారు. వీళ్లు ముగ్గురు చదువుకునే రోజుల నుంచి ఫ్రెండ్స్​. ఒకే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశారు. దినేష్ ఈ రంగంలోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘మా కాలేజీ రోజుల్లో ఒక పెయింటర్ బిల్డింగ్​కి రంగు వేస్తూ మొదటి అంతస్తు నుండి పడిపోయాడు. 

అప్పుడే ఇలాంటి పనులను సులభంగా చేసేందుకు ఏదైనా కొత్త మార్గాన్ని కనిపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచనతోనే స్టార్టప్​ పెట్టాం. ప్రస్తుతం నమూనాని తయారుచేశాం. త్వరలోనే రోబోని అందుబాటులోకి తీసుకొస్తాం.  ముఖ్యంగా నిర్మాణ రంగాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాం. మా రోబోలు ఖర్చు, నిర్మాణ సమయం తగ్గిస్తాయి” అన్నారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది. ఈ రోబోలు అందుబాటులోకి వస్తే.. 70 శాతం టైం,  50 శాతం ఖర్చు, 15 శాతం  మెటీరియల్ వేస్టేజీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.