జాబ్ నోటిఫికేషన్.. బీఎస్సీ చదివారా..? రైల్వేలో టెక్నికల్ పోస్టులు పడ్డయ్..

జాబ్ నోటిఫికేషన్.. బీఎస్సీ చదివారా..? రైల్వేలో టెక్నికల్ పోస్టులు పడ్డయ్..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, ఫీల్డ్ ఇంజినీర్, సైట్ అసెసర్ పోస్టుల భర్తీ కోసం రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(ఆర్ఐటీఈఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 19వ తేదీలోగా ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల సంఖ్య: 14
పోస్టులు: టెక్నీషియన్ 02, ఫీల్డ్ ఇంజినీర్ 06, సైట్ అసెసర్ 06.
ఎలిజిబిలిటీ: టెక్నీషియన్ పోస్టుకు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో బీఎస్సీ, ఫీల్డ్ ఇంజినీర్, సైట్ అసెసర్ పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రీషియన్ మెకానిక్స్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్స్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఐటీఐ.
వయో పరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 30.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.300.
లాస్ట్ డేట్: మే 19.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. 2.30 గంటల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. 

యూఆర్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు సాధిస్తేనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎంపికవుతారు. పూర్తి వివరాలకు www.rites.comలో సంప్రదించగలరు.