
స్మార్ట్ఫోన్ ప్రియులకు గుడ్న్యూస్..ముఖ్యంగా సామ్సంగ్ స్మార్ట్ఫోన్ కొనాలనుకొనే వారికి మరీ గుడ్ న్యూస్.. చాలామంది సెల్ ఫోన్ కొనే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు కోరుకుంటారు. కొందరు బ్యాటరీ బ్యాకప్ కోరుకుంటే. .మరికొందర స్క్రీన్ పెద్దదిగా ఉండాలని.. హ్యాండ్ సెట్ డిజైన్ బాగుండాలని..ఇంకొందరు స్మార్ట్ ఫోన్ పెద్దదిగా బరువు ఉండకుండా ..స్లిమ్ ఫీచర్లను కోరుకుంటారు. సరిగ్గా అలాంటి వారికోసమే సామ్ సంగ్ కొత్త ఫోన్ ను విడుదల చేయబోతోంది.. మరో వారంరోజుల్లో సాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ మార్కెట్లోకి రాబోతోంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
టెక్ దిగ్గజం అయిన శాంసంగ్.. తన కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ విడుదలకు సన్నహాలు చేస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన సాంసంగ్..మే 13న మార్కెట్లోకి విడుదల చేస్తోంది.ఈ హ్యాండ్సెట్ ప్రపంచంలోనే అత్యంత సన్నని హ్యాండ్రాయిడ్ స్మార్ట్ఫోన్. ఇప్పటివరకు అత్యంత సన్నని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, దీని పేరు గెలాక్సీ S25 ఎడ్జ్.
Also Read : నిస్సాన్ మెగా డిస్కౌంట్ ఆఫర్
లీక్ సమాచారం ప్రకారం.. గెలాక్సీ S25ఎడ్జ్ కేవలం 5.8mm అల్ట్రా స్లిమ్ ప్రొఫైల్ ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గా ఉండబోతోంది. మొబైట్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) లో ఈ హ్యాండ్ సెట్ స్నీక్ పీక్ ను అందించింది సాంసంగ్. గెలాక్సీ S25 అల్ట్రా మాదిరిగానే ప్రీమియం డిజైన్, పవర్ ఫుల్ కెమెరా సెటప్ తో వస్తుంది.
గెలాక్సీ ఎస్25 అల్ట్రా వంటి కెమెరా స్పెక్స్
Samsung Galaxy S25 Edge లో 200MP ప్రైమరీ కెమెరా, బ్యాక్ లో 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉంటాయి. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ నిలువుగా అమర్చబడి ఉంటుంది. పక్కన LED ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు ,వీడియో కాల్‌ల కోసం ఈ డివైజ్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన12MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.ఇది షార్ప్ షాట్లు,స్థిరమైన వీడియోలను అందిస్తుంది.