
Nissan X-Trail: జర్మన్ ఆటో దిగ్గజం నిస్సాన్ ఇండియాలో కూడా తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ తన నిస్సాన్ ఎక్స్ ట్రెయిల్ మోడల్ ను 2024లో లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ దాదాపు రూ.20 లక్షల భారీ డిస్కౌంట్ రేటుకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడైంది.
ఈ మోడల్ కార్లను కంపెనీ దాదాపు 40 శాతం డిస్కౌంట్ రేటు వద్ద విక్రయానికి అందుబాటులో ఉండటం గమనార్హం. గత ఏడాది భారత మార్కెట్లోకి విడుదల చేయబడిన ఈ కారు ఏకంగా రూ.50 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకు విక్రయాలను ప్రారంభించారు. అయితే లాంట్ నాటి నుంచి కేవలం 37 యూనిట్లను మాత్రమే డీలర్లకు కంపెనీ డెలివరీ చేసినట్లు సేల్స్ డేటా వెల్లడిస్తోంది. పూర్తిగా దిగుమతి చేసుకోబడిన ఈ కార్లు ప్రస్తుతం 150 వరకు దేశంలో విక్రయించటానికి నిస్సాన్ ప్రయత్నిస్తోంది.
Also Read : బెంగళూరులోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త..!!
నిస్సాన్ ఎక్స్ ట్రెయిల్ 4వ తరం మోడల్ ప్రపంచ వ్యాప్తంగా ఆటో లవర్స్ నుంచి మంచి ప్రజాధరణను పొందిందని నిస్సాన్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. ఇక కారు మోడల్ ఫీచర్లను పరిశీలిస్తే.. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్తో మూడు సిలిండర్లు కలిగిన ఇంజిన్ 160 హార్స్ పవర్ కలిగి ఉంటుంది. ఇది టయోటా ఫార్చునర్, స్కోడా కొడియాక్, హుందాయ్ టుక్సన్ వంటి మోడళ్లకు పోటీగా మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ మోడల్ అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉండకపోవటం యూజర్లను ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు.
ఈ కారు ఫ్యాబ్రిక్ సీట్లను కలిగి ఉండటం, ఎలక్ట్రికల్ గా డ్రైవర్ సీట్లను అడ్జెస్ట్ చేసుకోవటానికి అవకాశం లేకపోవటం, ముందు సీటుకు వెంటిలేషన్, చిన్న టచ్ స్కీన్, పాత కాలం నాటి యూఐ, అడాస్ సిస్టమ్ లేకపోవటం వంటివి పోటీదారుల ముందు నిలబడలేకపోవటానికి కారణంగా నిలిచిందని ఆటో నిపుణులు చెబుతున్నారు. భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన మోడల్ అనేక ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉండకపోవటం చాలా మందిని నిరాశకు గురిచేసింది.
ఎలాంటి జంజాటాలు లేకుండా కంఫర్టబుల్ సాఫ్ట్ రోడ్డర్ కోసం వెతుకున్న వారికి ఈ కారు బాగా నచ్చుతుందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.