
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనాలపై నిబంధనలు విధించారు ఆలయ ఈవో వెంకట్రావు. ప్రోటోకాల్, ప్రత్యేక దర్శనాలను స్వయంగా ఆలయానికి వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీ ప్రముఖులకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వేసవి సెలవుల సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తుల రాక ఉండటం శని, ఆదివారాల్లో మరింత అధిక సంఖ్యలో భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ప్రోటోకాల్ దర్శనాలను స్వయంగా వచ్చే వీఐపీ ప్రముఖులకు పరిమితం చేస్తూ నిర్ణయం తసీసుకన్నారు. మరో వైపు మే 9 నుంచి11 వరకు స్వామివారి జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నారు.