రైతులు అధైర్య పడొద్దు.. నష్టపరిహారం అందేలా కృషి చేస్తా.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రైతులు అధైర్య పడొద్దు.. నష్టపరిహారం అందేలా కృషి చేస్తా.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా బీమారం మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వివేక్. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని.. నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు. గత రెండు రోజుల క్రితం గాలివాన బీభత్సంతో పంట పొలాలు, విద్యుత్ స్తంభాలు,చెట్లు విరిగిపోవడం,చేతికొచ్చిన పంట నెలరాలడంతో తీవ్రంగా నష్టపోయామని తెలిపారు రైతులు.

నష్టపోయిన ప్రతి ఒక్క రైతులు ఆదుకుంటామని.. తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత కాలేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయినా రైతులకు నష్టపరిహారం ఇప్పించానని అన్నారు ఎమ్మెల్యే వివేక్. ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఆపలేరని.. పెద్ద ఎత్తున పంటలు దెబ్బ తినడం బాధాకరమని అన్నారు.

దెబ్బతిన్న ఇండ్లను,పంటలను మరోసారి అధికారులు రీ సర్వే చేయాలని.. జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలనే కోరారు ఎమ్మెల్యే వివేక్. రైతులు ఎవరు ఆ ధైర్యపడొద్దని.. నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే వివేక్.