
Electric Scooters: ప్రస్తుతం చాలా మంది వాహనదారులు పెరుగుతున్న ఇంధన ఖర్చులను తగ్గించుకునేందుకు ఈవీల వైపు ఎక్కువగా మెుగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈవీలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న వేళ ఈ రంగంలో కీలక ఆటగాడిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మాత్రం అమ్మకాల్లో వెనకబడింది.
ఏప్రిల్ మాసంలో ఓలా టాప్ ఈవీ సెల్లర్ స్థానాన్ని కోల్పోయి రెండవ స్థానానికి పరిమితం అయ్యింది. అయితే మెుదటి స్థానాన్ని టీవీఎస్ అధిరోహించింది. ఇదే క్రమంలో బజాజ్ సైతం వేగంగా ఈవీ అమ్మకాలతో మార్కెట్లో మంచి వాటాను దక్కించుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ తన ఫిబ్రవరి అమ్మకాల విషయంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దర్యాప్తులో ఉంది. మార్చి నెలలో కంపెనీ అమ్మకాలు పడిపోవటంతో బజాజ్, టీవీఎస్ తర్వాతి స్థానానికి పడిపోయింది.
ఏప్రిల్ మాసంలో ఓలా ఎలక్ట్రిక్ 11వేల 330 యూనిట్లను విక్రయించింది. ఇది మెుత్తం మార్కెట్ అమ్మకాల్లో 23 శాతం కావటం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 25వేల యూనిట్లను విక్రయించినట్లు లెక్కల్లో చూపగా.. వాహన్ డేటా మాత్రం 8వేల 653 రిజిస్ట్రర్డ్ యూనిట్లను చూపింది. ఈ భారీ గ్యాప్ విషయంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఫిబ్రవరిలో కంపెనీ ఇంకా లాంచ్ చేయని మోడళ్లకు చెల్లించిన అడ్వాన్స్ బుక్కింగ్స్ సంఖ్యలను సైతం లెక్కించటమే తప్పుడు డేటాకు కారణంగా తెలుస్తోంది.
ప్రస్తుతం తన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు బయటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఓలా వెల్లడించింది. అయితే ఏప్రిల్ మాసంలో టీవీఎస్ 10వేల 335 యూనిట్లను అమ్మి 21 శాతం వాటాతో తొలిస్థానంలో నిలిచింది. ఇక ఓలా రెండోస్థానానికి పరిమితం కాగా.. ఏథర్ ఎనర్జీ 7వేల 765 యూనిట్లను విక్రయించింది. ఇక హీరో మోటార్స్ వెదా 2వేల 865 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇదే క్రమంలో బజాజ్ ఏప్రిల్ మాసంలో 9,436 ఈవీలను విక్రయించగలిగింది.