తిరుమలలో గెస్ట్ హౌస్ లకు భగవంతుడి పేర్లు.. టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమలలో గెస్ట్ హౌస్ లకు భగవంతుడి పేర్లు.. టీటీడీ కీలక నిర్ణయం..

కలియుగ వైకుంఠం తిరుమలలో ఆధ్యాత్మికశోభ ఉట్టిపడేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇందులో భాగంగా తిరుమలలో ఉన్న పలు గెస్ట్ హౌస్ లకు పేర్లు మార్చింది టీటీడీ. పలు గెస్ట్ హౌస్ లకు దాతలు తమ సొంత పేర్లను పెట్టుకున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమలలో ఏదైనా భగవంతుని పేరుతోనే ఉండాలని.. గోవిందనామ స్మరణ మాత్రమే వినపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ.

తిరుమలలో దాతలు నిర్మించి టీటీడీకి ఇచ్చిన గెస్ట్ హౌస్ లలో న్ 42 భవనాలకు దాతల సొంత పేర్లు ఉన్నాయని.. వెంటనే వాటిని మార్చాలని గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన పాలకమండలి నిర్ణయం తీసుకుంది. భగవంతుడికి సంభందించి 150 పేర్లను సూచించి, వాటిలో ఎదైనా ఒకటి‌ గెస్ట్ హౌస్ కు పేరుగా పెట్టుకోవాలని అదేశించింది టీటీడీ.

వికాస్ నిలయం పేరు వైష్ణవి సదనంగా.. వెంకట కళా నిలయం పేరును వేంకటకళా నిలయంగా మార్చారు. జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయంకు రాఘవ నిలయం, మైహోమ్ పద్మాప్రీయ గెస్ట్ హౌస్ కు పద్మాప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, పాండవ విశ్రాంతి భవనం కు విరజా నిలయంగా పేర్లు మార్చారు దాతలు.ఇక మీదట నిర్మాణాలు జరిగే ఏ బిల్డింగ్ కి అయినా... భగవంతుడి పేరు మాత్రమే ఉండాలని సూచిచింది టీటీడీ.