బతుకు పోరాటం : కువైట్ పనోళ్లలో మనోళ్లే చాలా ఎక్కువ

బతుకు పోరాటం : కువైట్ పనోళ్లలో మనోళ్లే చాలా ఎక్కువ

గతేడాదితో పోలీస్తే  కువైట్‌లో పని చేస్తున్న భారతీయులు సంఖ్య ఈ ఏడాది 30 శాతం పెరిగిందని అరబిక్ డైలీ అల్-రాయ్ తెలిపింది.  కువైట్‌లో మొత్తం గృహ కార్మికుల సంఖ్య 2023 అక్టోబర్ నాటికి 8,11,000కి చేరుకుంది.  ఇది 2021 చివరి నాటికి 5, 83,000 గా ఉంది.  ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకోవడానికే కువైట్‌ ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ ఎక్కువగా మనదేశానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.  

అక్టోబర్ నాటికి కువైట్‌లో పని చేస్తున్న కార్మికుల జాబితా 

  • భారత్  : 371,222 మంది కార్మికులు (71.3 శాతం పురుషులు - 28.7 శాతం స్త్రీలు)
  • ఫిలిప్పీన్స్ : 201,110 మంది కార్మికులు (0.6 శాతం పురుషులు - 99.4 శాతం స్త్రీలు)
  • శ్రీలంక : 103,685 మంది కార్మికులు (20.6 శాతం పురుషులు - 79.4 శాతం స్త్రీలు)
  • బంగ్లాదేశ్ : 85,989 మంది కార్మికులు (99 శాతం పురుషులు - 1 శాతం మహిళలు)
  • నేపాల్ : 25,540 మంది కార్మికులు (4.7 శాతం పురుషులు - 95.3 శాతం స్త్రీలు)
  • ఇథియోపియా : 11,684 మంది కార్మికులు (8.2 శాతం పురుషులు - 91.8 శాతం స్త్రీలు) 

ALSO READ | గ్రేట్ కంపెనీ : ఆఫీస్ బాయ్ తో సహా కార్లు ఇచ్చిన ఓనర్