కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 తులాల బంగారం చోరీ

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 తులాల బంగారం చోరీ

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని ఓ అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 తులాల బంగారం చోరీకి గురైంది. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. వివేకానందపూరికాలనీ రోడ్ నెంబర్ 5లోని భార్గవి అపార్టమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేదవ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివాసం ఉంటున్నారు. ఆ అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రంగులు వేస్తుండడంతో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాళం వేసి  శ్రీపురంకాలనీలో ఇంట్లో కుటుంబ సభ్యులతో అక్కడి వెళ్లారు.  

తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ తాళం పగలగొట్టి  బీరువా తెరిచి ఉంది.  అందులో ఉన్న 30 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.