
అవినీతి ఆఫీసర్లపై విచారణలో సర్కార్ నిర్లక్ష్యం
గవర్నర్ కు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లెటర్
హైదరాబాద్, వెలుగు: ఏసీబీ కేసుల విచారణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ట్రాప్ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అవినీతి అధికారులకుసెక్రటేరియట్ కొమ్ము కాస్తోందన్నారు. అవినీతి కేసుల్లో పట్టుబడ్డ అధికారులకు డిపార్ట్‌మెంటల్ క్లీన్ చిట్ ఇస్తోందని ఆరోపించారు. పైరవీలు,సెక్షన్ ఆఫీసర్ల అవినీతి రిపోర్టులతో కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదని తెలిపారు. ఇలా సుమారు300 కేసులు ఏండ్ల తరబడి కోర్టు విచారణకు నోచుకోవడంలేదన్నారు. ఇలాంటి కేసులపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ బుధవారం గవర్నర్ తమిళిసైకి పద్మనాభరెడ్డి లెటర్ రాశారు. అన్ని డిపార్ట్‌మెంట్లలో సెక్షన్ ఆఫీసర్లు ఇచ్చిందే ఫైనల్ రిపోర్ట్‌గా చేస్తున్నారని ఆయన లేఖలో తెలిపారు.