
అగర్తల: కరోనా కేర్ సెంటర్ నుంచి 31 మంది పేషెంట్లు పారిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ పేషెంట్లు త్రిపుర స్టేట్ రైఫిల్స్ రిక్రూట్‌మెంట్ కోసం వెళ్లారు. అయితే వారికి కరోనా సోకవడంతో అరుంధతి నగర్‌లోని కరోనా కేర్ సెంటర్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కరోనా సెంటర్ ముందు వైపు భద్రత ఎక్కువగా ఉండటంతో వెనుక వైపు ఉన్న గోడపై నుంచి దూకి తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వారి సొంత రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లు, రైల్వే అధికారులకు సమాచారం అందజేశామని సదర్ సబ్‌డివిజనల్ పోలీసు అధికారి అనిర్బన్ దాస్ తెలిపారు. పారిపోయిన పేషెంట్ల గురించి వెతుకుతున్నామని స్పష్టం చేశారు.