బీహార్ లో కొలువుదీరిన కొత్త కేబినెట్

బీహార్ లో కొలువుదీరిన కొత్త కేబినెట్

బీహార్లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. నితీష్ కేబినెట్లో 31మంది కొత్తగా చేరారు. మంత్రులతో గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. మహాకూటమి భాగస్వామ్యపక్షమైన ఆర్జేడీ కేబినెట్లో అత్యధిక స్థానాలను దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి 16మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. నితీశ్ పార్టీకి చెందిన 11మంది మంత్రులుగా ప్రమాణం చేయగా..కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్తానీ ఆవామ్ మోర్చా నుంచి ఒకరు, ఒక ఇండిపెండెంట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

 

ఆర్జేడీ నుంచి తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, లలిత్ యాదవ్, సురేంద్ర యాదవ్, కుమార్ సర్వజీత్, సురేంద్ర రామ్,షానవాజ్ ఆలం, సమీర్ మహేసేత్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా ఈ నెల మొదట్లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిశారు నితీష్ కుమార్. ఆ తర్వాత ఈ నెల 10న నితీష్ సీఎం, తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. బీహార్ కేబినెట్ లో సీఎంతో కలిపి 36 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే భవిష్యత్ లో జరిగే విస్తరణ కోసం కొన్ని స్థానాలను ఖాళీగా ఉంచనున్నట్లు తెలుస్తోంది.