యువ హీరోతో ప్రేమాయణం! డ్రగ్స్ కేసులో పట్టుబడిన లావణ్య

యువ హీరోతో  ప్రేమాయణం! డ్రగ్స్ కేసులో పట్టుబడిన లావణ్య

గండిపేట్,వెలుగు : నార్సింగిలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో పట్టుబడిన యువతి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన లావణ్య సినిమా రంగంలో చాన్సుల కోసం ప్రయత్నించింది. చిన్న సినిమాల్లో నటించిన ఆమె మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాను పని చేసింది. పలు సినిమాల్లో క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిలిమ్స్ లో హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తూ జల్సాలకు అలవాటు పడింది. 

ఓ యువ  హీరోతో  ప్రేమాయణం సాగించినట్లు తెలుస్తోంది. వరలక్ష్మి టిఫిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో అనుమానితురాలిగా లావణ్య ఉంది. కొంత కాలంగా ఉనిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అనే వ్యక్తి నుంచి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేస్తుందని పోలీసులు చెబుతున్నారు. లావణ్య సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఆమెకు చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తిస్తున్నారు.