భార్యతో వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో చనిపోయిన భర్త

భార్యతో వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో చనిపోయిన భర్త

గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. భార్యతో  వాకింగ్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఇండోర్​ లో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 32 ఏళ్ల జగదీష్​ అనే వ్యక్తి  ఆదివారం ( ఫిబ్రవరి 18) తన భార్యతో కలిసి వాకింగ్​కు వెళ్లాడు.  ఆ సమయంలో అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆయన భార్య వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అప్పటికే జగదీష్​ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  భార్యభర్తలు షాపింగ్​నకు దగ్గరలోని షాపునకు వెళ్లారు. 

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్​కు తల్లిదండ్రులు గతంలోనే మరణించారు.  ఐదుగురు అక్కా చెల్లెళ్లు.  జగదీష్​ కు రెండేళ్ల క్రితం వివాహమైంది. సోమవారం ( ఫిబ్రవరి 19) తెల్లవారుజామున   జగదీష్​ సోదరీమణులకు విషయం తెలిపింది.  సైలంట్​ హార్ట్​ ఎటాక్​ అని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పోస్ట్​ మార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

శనివారం ( ఫిబ్రవరి 17) ఇండోర్​ లోని  ముసాఖేడి ప్రాంతంలో రాహుల్ రైక్వార్(26) అనే వ్యక్తి కూడా ఇలానే మరణించాడు.  తన తమ్ముడితో కలిసి బైక్​ పై పిలియన్​ రైడింగ్​ చేస్తున్న సమయంలో రాహుల్​ మార్గమధ్యంలో గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.