డీఈఈసెట్​కు 33 వేల మంది హాజరు..77.54 శాతం అటెండెన్స్: కన్వీనర్

డీఈఈసెట్​కు 33 వేల మంది హాజరు..77.54 శాతం అటెండెన్స్: కన్వీనర్

హైదరాబాద్, వెలుగు: డీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన డీఈఈసెట్ 2025 ప్రశాంతంగా ముగిసింది. మొత్తం రెండు సెషన్లలో ఎగ్జామ్ జరగ్గా, 77.54 శాతం మంది అటెండ్  అయ్యారని డీఈఈ సెట్ కన్వీనర్  రమేశ్  ఒక ప్రకటనలో తెలిపారు. 43,615 మంది హాజరు కావాల్సి ఉండగా, 33,821 మంది హాజరయ్యారని ఆయన చెప్పారు.

తెలుగు మీడియం అభ్యర్థులకు మార్నింగ్  సెషన్ లో 87 సెంటర్లలో ఎగ్జామ్  జరిగిందన్నారు. 19,900 మంది అంటెండ్  కావాల్సి ఉండగా 15,476 మంది హాజరయ్యారని చెప్పారు. మధ్యాహ్నం సెషన్​లో ఇంగ్లిష్, ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఎగ్జామ్  జరగ్గా 23,715 మందికి 18,345 మంది హాజరయ్యారని వెల్లడించారు.  ఈనెల 28 లోగా ప్రిలిమినరీ కీ రిలీజ్  చేస్తామని రమేశ్  పేర్కొన్నారు.