MMTS రైళ్లకు ఆదరణ తగ్గుతుందా ? అంటే ఎస్ అనే సమాధానం వస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ రైళ్లల్లో రద్దీ అమాంతం తగ్గుతోంది. కరోనా ముందు ఎంతో కళకళలాడిన ఈ రైళ్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. ప్రయాణీకుల నుంచి స్పందన రావడం లేదు. దాదాపు లక్షన్నర మంది ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించుకొనే వారు. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మే 29వ తేదీ ఆదివారం పలు మార్గాల్లో రైళ్ల సర్వీసులను రద్దు నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
మొత్తం 34 రైళ్లు అందులో ఉన్నాయని తెలిపారు. లింగంపల్లి - హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 సర్వీసులు, ఫలక్ నుమా - లింగంపల్లి 14, సికింద్రాబాద్ - లింగంపల్లి మధ్య 2 చొప్పున సర్వీసులు రద్దయ్యాయి. అయితే.. రద్దు చేసిన మార్గాల్లో అదనంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ గ్రేటర్ అధికారులు అందుకు చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ - హైటెక్ సిటీ (54), సికింద్రాబాద్ - పటన్ చెరు (84), చాంద్రాయణగుట్ట - పటన్ చెరు (108), సికింద్రాబాద్ - బోరబండ (16), కేశవగిరి - బోరబండ (22) వరకు అదనపు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం : -
మంత్రి పేరుతో రియల్ దందా
ధరలు పెరిగినా తగ్గని అమ్మకాలు
