భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద..మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ ఫైర్

భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద..మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా మారారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం గాంధీ భవన్‌‌లో మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్‌‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కమ్యూనిస్టు పార్టీ మినహా దాదాపు అన్ని పార్టీలు మారిన కేపీ వివేకానందకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రేవంత్ రెడ్డిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కుత్బుల్లాపూర్‌‌‌‌లో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.