యాక్సిడెంట్లో చనిపోయిన భార్యాభర్త, పిల్లాడు.. డెడ్ బాడీలను ఇంట్లోకి తీసుకు రానివ్వని ఓనర్

యాక్సిడెంట్లో చనిపోయిన భార్యాభర్త, పిల్లాడు.. డెడ్ బాడీలను ఇంట్లోకి తీసుకు రానివ్వని ఓనర్

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో దూడల సాయి ప్రకాశ్ అతడి భార్య సంధ్య, కొడుకు మోక్షిత్ చనిపోయిన విషయం తెలిసిందే. వారి డెడ్ బాడీలకు పాల్వంచ హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సోమవారం భద్రాచలం తీసుకొచ్చారు.

కానీ డెడా బాడీలను సాయి ప్రకాశ్ అద్దెకు ఉంటున్న వెంకటేశ్వరకాలనీలోని ఇంటి ఓనర్ సాంబశివరావు ఇంట్లోకి తీసుకురానివ్వలేదు. డెడ్ బాడీలను ఇంట్లోకి తీసుకొస్తే కీడు జరుగుతుందంటూ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

పలు రాజకీయపార్టీ నాయకులు, ప్రజాసంఘాల సభ్యులు వచ్చి సాంబశివరావుతో మాట్లాడినా ఒప్పుకోలేదు. దీంతో ముగ్గురి డెడ్ బాడీలను అంబులెన్స్ లో ఉంచి 15 నిముషాల పాటు ఇంటి ముందే ఉన్నారు. తర్వాత సాయిప్రకాశ్​ అత్త గారి ఊరైన విలీన ఆంధ్రా ఎటపాక మండలం పురుషోత్తపట్నంకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇంటి ఓనర్ సాంబశివరావు తీరుపై పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.