హైదరాబాద్,వెలుగు: ఇంజినీరింగ్ , ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎప్ సెట్ (ఎంసెట్)కు శనివారం సా యంత్రం నాటికి 3,41,548 దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీ రింగ్ స్ర్టీమ్ కు 2,46,056, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ కు 95,185, రెండింటికీ 317 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లో తెలంగాణ విద్యార్థులు 2,83,570 మంది, ఏపీ నుంచి 57,978 మంది ఉన్నారు.
కాగా, ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, శనివారంతో ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ముగిసింది. వివిధ రకా ల ఫైన్ లతో మే 1 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.