న్యూఢిల్లీ: పేటీఎం ఐపీఓ ఏకంగా 350 మందిని కోటీశ్వరులుగా మార్చింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ సిద్ధార్ద్ పాండే ఈ పబ్లిక్ ఇష్యూ తర్వాత మిలియనీర్‌గా మారారు. పేటీఎం స్టార్టింగ్ స్టేజ్‌లో ఈ కంపెనీలో జాబ్ చేయడానికి తన ఫాదర్ ఒప్పుకోలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కంపెనీలో జాబ్ చేస్తున్న వారు, మానేసిన వారిని కలిపితే మొత్తం 350 మంది సంపద రూ. కోటి దాటింది. వచ్చే వారం పేటీఎం షేర్లు మార్కెట్‌లో లిస్టింగ్ అవుతాయి. షేర్ల రేటు పెరిగితే వీరి సంపద మరింత పెరుగుతుంది.
