డేంజర్ జోన్​లో 36 వరల్డ్ సిటీస్

డేంజర్ జోన్​లో 36 వరల్డ్ సిటీస్
  •     వచ్చే 80 ఏండ్లల్లో నీటి మునగనున్న ప్రధాన నగరాలు
  •     ఫస్ట్ ప్లేస్​లో టోక్యో, తర్వాతి స్థానంలో  ముంబై
  •     22 కోట్ల మందిపై పడనున్న ప్రభావం
  •     ద స్వీఫ్ టెస్ట్.కామ్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడి

వెలుగు: దేశంలోని ముంబై, కోల్‌కతాతోపాటు దుబాయ్, లండన్, న్యూయార్క్ సహా ప్రపంచంలోని 36 పెద్ద నగరాలు త్వరలో నీటిలో మునిగిపోనున్నాయి.  గ్లోబల్ వార్మింగ్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడమే దీనికి కారణమని భూగోళ, పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో అనుకున్నదానికంటే ఇప్పుడు సముద్ర మట్టాలు మరింత వేగంగా పెరుగుతున్నాయని భయందోళన వ్యక్తం చేస్తున్నారు. ది స్వీఫ్ టెస్ట్.కామ్ లోని పరిశోధకులు క్లైమేట్ సెంట్రల్ కి చెందిన కోస్టల్ రిస్క్ స్క్రీనింగ్ టూల్‌ని ఉపయోగించి వాతావరణంపై చేసిన రీసెర్చ్ రిపోర్ట్ తాజాగా విడుదలైంది. 

వచ్చే 80 ఏండ్లల్లో ప్రపంచంలోని 36 నగరాలు సముద్రంలో మునిగిపోతాయని  ఈ రిపోర్టు వెల్లడించింది. నివేదిక ప్రకారం.. డేంజర్ జోన్లో ఉన్న సీటీల జాబితాలో శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరంతో సహా అమెరికాలోని 10 ప్రధాన నగరాలు ఉన్నాయి. లిస్టులో  భారత్‌లోని ముంబై, కోల్‌కతాతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా పేరు కూడా ఉంది. సముద్ర మట్టంపెరుగుదల, తరచుగా వచ్చే వరదలే ఈ నగరాలను ముంచనున్నాయి.  దీని వల్ల 22 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం అవుతారని ఎక్స్ పర్ట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఉష్ణోగ్రత 5.4 డిగ్రీలు పెరిగితే ప్రమాదం 

గ్లోబల్ ఉష్ణోగ్రత 5.4 డిగ్రీల ఫారెన్‌హీట్ పెరగడంతోపాటు సముద్ర మట్టాలు ఇంకో 1.5 మీటర్లుకు చేరితే నగరాలు మునుగుతాయని రిపోర్ట్ వెల్లడించింది. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించకపోతే 2100 నాటికి సముద్ర మట్టం 2.5 మీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే, వచ్చే 80 ఏండ్లల్లో  సముద్ర మట్టం1.5 మీటర్లకు చేరనుందని వివరించింది. దీని వల్ల సముద్రం ఒడ్డున ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలతోపాటు మొత్తం 36 ప్రధాన సిటీలు నీట మునగనున్నట్లు చెప్పింది. 

ఈ జాబితాలో దాదాపు 3,74,35,100 మంది ప్రజలు నివసించే టోక్యో మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో భారత్ లోని ముంబై ఉన్నట్లు తెలిపింది. ముంబైలోని మహాలక్ష్మి దేవాలయం, మన్నాత్, ఇతర పర్యాటక ప్రాంతాల్లో చేపలు, సముద్ర జీవులను చూసే ప్రమాదముందని హెచ్చరించింది.  ఇక మూడవ స్థానంలో 2,01,40,400మంది నివసిస్తున్న న్యూయార్క్ సిటీ ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది.  

నీటి మునిగే నగరాలివే.. 

  • టోక్యో, జపాన్                                   
  • ముంబై, భారత్                                  
  • న్యూయార్క్ సిటీ, అమెరికా          
  • ఒసాకా, జపాన్                                 
  • ఇస్తాంబుల్, టర్కీ                             
  • కోల్‌కతా, భారత్                              
  • బ్యాంకాక్, థాయిలాండ్                
  • జకార్తా, ఇండోనేషియా                
  • లండన్, యునైటెడ్ కింగ్ డమ్   
  • ఢాకా, బంగ్లాదేశ్                             
  • హోచిమిన్, వియత్నాం                
  • శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా           
  • మియామి, అమెరికా                       
  • అలెగ్జాండ్రియా, ఈజిప్ట్                  
  • సిడ్నీ, ఆస్ట్రేలిస్ట్రేయా                            
  • బోస్టన్, అమెరికా                             
  • లిస్బన్, పోర్చుగల్                              
  • దుబాయ్, యూఏఈ                     
  • వాంకోవర్, కెనడా                          
  • అబుదాబి, యూఏఈ                    
  • కోపెన్హాగన్, డెన్మా ర్క్                     
  • న్యూ ఓర్లీన్స్, అమెరికా                   
  • డబ్లిన్, ఐర్లాండ్                                 
  • హోనోలులు, అమెరికా 
  • అమ్‌స్టెర్‌డమ్‌, నెదర్లాండ్స్               
  • కాంకున్, మెక్సికో                              
  • వెనిస్, ఇటలీ                                        
  • చార్లెస్టన్, అమెరికా                           
  • మకావు, చైనా                                     
  • మగ, మాల్దీవుల్దీలు                             
  • లాంగ్ బీచ్, అమెరికా                      
  • సవన్నా, అమెరికా                             
  • నసావు, బహమాస్                          
  • పుంటా కానా, డొమినికన్ రిపబ్లిక్ 
  • కీ వెస్ట్, అమెరికా                                   
  • కాక్బర్న్ టౌన్​, టర్క్స్ & కైకోస