తెలంగాణలో కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు

 తెలంగాణలో కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో  కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు నిర్వహించగా..3,660 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.GHMC పరిధిలో అత్యధికంగా 574 మందికి కరోనా సోకింది. కేసులకు సంబంధించి ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 217 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,826 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది చనిపోయారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,44,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,95,446 మంది కోలుకున్నారు. ఇంకా 45,757 మందికి ఐసోలేషన్ లో..ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తంగా మరణాల సంఖ్య 3,060కి చేరింది.