హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ సందడి

హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ సందడి

హుస్సేన్ సాగర్లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి నెలకొంది. 36వ సారి హుస్సేన్ సాగర్ ఆతిథ్యమిస్తున్న ఈ పడవ పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతి ఏటా ఎంతో గ్రాండ్ గా జరిగే ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 75 మంది ప్లేయర్లతో పాటు... ఆర్మీ, నేవీల జట్లు ఉత్సాహంగా పాల్గొంటాయి. ఇందులో ముంబైకి చెందిన ఆర్మీ యాటింగ్ నోడ్, నేవీ టీమ్, త్రిష్ణ సేయిలింగ్ క్లబ్ ఆర్మీ, మైసూర్, నేషనల్ సేయిలింగ్ స్కూల్ బోపాల్, గోవాకి చెందిన నేవి స్కూల్ బాయ్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలను లేసర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారంతో నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్ క్లబ్ ప్రకటించింది. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన ప్లేయర్లకి ర్యాంకింగ్ వస్తుందన్నారు క్లబ్ ప్రతినిధులు. ఈ ర్యాంకింగ్ ని బట్టి.. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాలు వస్తాయన్నారు. 

లేసర్, స్టాండర్డ్ ఈవెంట్ లకి సంబంధించిన ఇల్కా-7, ఇల్కా-6 లాంటి ఈవెంట్స్ లో మెన్ అండ్ ఉమెన్ కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణకు చెందిన హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్, యాట్ క్లబ్, సికింద్రాబాద్ సేయిలింగ్ క్లబ్ కి చెందిన దాదాపు 20 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు. ప్లేయర్ల కోసం స్పెషల్ క్యాంప్ ని కూడా నిర్వహించింది సికింద్రాబాద్ సేయిలింగ్ క్లబ్. ఇక హుస్సేన్ సాగర్ లో నీళ్ళు బాగో లేవన్న వీరు.. క్లీన్ చేయాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. హుస్సేన్ సాగర్ ని క్లీన్ చేస్తే... అంతర్జాతీయ ఈవెంట్లను ఇక్కడే నిర్వహించవచ్చంటున్నారు ఆర్గనైజర్స్.