పరీక్షలకు ప్రత్యేకం: ఆర్టికల్ 370 బిట్ బ్యాంక్

పరీక్షలకు ప్రత్యేకం: ఆర్టికల్ 370 బిట్ బ్యాంక్

ఆర్టికల్ 370 అంటే?

– భారత రాజ్యాంగంలోని 21వ భాగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్ము కాశ్మీర్​కు ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా అమలులో ఉండడం.

ఆర్టికల్ 35 ఏ అనగా?

– కాశ్మీర్‌‌లో శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధన.

ఏ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రప్రభుత్వం జమ్ము కాశ్మీర్‌‌కున్న స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది?

– ఆర్టికల్ 370 క్లాజ్ (3)

ఆర్టికల్‌ 370 క్లాజ్ (3) ఏం చెబుతుంది?

– భారత రాష్ట్రపతి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా ఆర్టికల్ 370 అమలును నిలిపివేసే లేదా సవరించే అధికారం ఉంది.

జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, పునర్‌‌వ్యవస్థీకరణ బిల్లు – 2019ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదట ఏ సభలో ప్రవేశపెట్టారు?

– రాజ్యసభ

కాశ్మీర్‌‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు చేసేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

– 2019 ఆగస్టు 5 (అదేరోజు రాజ్యసభ ఆమోదించింది)

జమ్ము కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లును లోక్‌సభ ఎప్పుడు ఆమోదించింది?

– 2019 ఆగస్టు 6

జమ్ము కాశ్మీర్ విభజన బిల్లును రాజ్యసభ ఎంత మెజారిటీతో ఆమోదించింది?

– 125 : 61

జమ్ము కాశ్మీర్ విభజన బిల్లును లోక్‌సభ ఎంత మెజారిటీతో ఆమోదించింది?

– 370 : 70

ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి లోక్‌సభలో లభించిన మెజారిటీ ఎంత?

– 351 : 72

పార్లమెంటు సిఫార్సు మేరకు, మొదటి క్లాజ్ మినహా ఆర్టికల్‌ 370లోని అన్ని నిబంధనల అమలును ఏ తేదీ నుంచి నిర్వీర్యం చేసినట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు?

– 2019 ఆగస్టు 5

ఏ పేరుతో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి జారీచేశారు?

– రాజ్యాంగ(జమ్ముకాశ్మీర్‌‌కు వర్తింపు) ఉత్తర్వులు – 2019

రాజ్యాంగ(జమ్ముకాశ్మీర్‌‌కు వర్తింపు) ఉత్తర్వులు – 2019 అమల్లోకి రాగానే ఏవి రద్దు కానున్నాయి?

– రాజ్యాంగ(జమ్ము కాశ్మీర్‌‌కు వర్తింపు) ఉత్తర్వులు – 1959

ఆర్టికల్ 370 క్లాజ్ (3)లో ‘రాష్ట్ర రాజ్యాంగ శాసనసభ’కు బదులుగా ఇప్పుడు ఏమని చదవాలి?

– రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ

జమ్ము కాశ్మీర్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రాన్ని ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారు?

– అసెంబ్లీతో కూడిన జమ్ము – కాశ్మీర్, అసెంబ్లీ లేని లడఖ్

ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య?

– 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు

జమ్ము కాశ్మీర్ పునర్‌‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందక ముందు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య?

– 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు

దేశంలో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఏవి?

– 3 (ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్ము కాశ్మీర్)

విభజనబిల్లు ప్రకారం జమ్ము కాశ్మీర్​
శాసనసభలో మంత్రిమండలి శాతం ఎంత ఉండాలి?

– 10 శాతానికి మించకూడదు

విభజన బిల్లు ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ జమ్ము కాశ్మీర్ శాసనసభకు ఎంతమంది శాసనసభ్యులను నామినేట్ చేస్తారు?

– ఇద్దరు( సభలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే మహిళా సభ్యులను నామినేట్ చేయవచ్చు)

జమ్ము కాశ్మీర్‌‌లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం శాసనసభ్యుల సంఖ్య ఎంతకు చేరనుంది?

– 114

114 శాసనసభ స్థానాలలో ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌’లో ఖాళీగా చూపించే స్థానాల సంఖ్య?

– 24 సీట్లు

జమ్ముకాశ్మీర్‌‌లో ఎన్ని లోక్‌సభ స్థానాలున్నాయి?        – 5

లడఖ్‌లో ఎన్ని లోక్‌సభ స్థానాలున్నాయి?

– ఒకటి

ఉమ్మడి జమ్ము కాశ్మీర్‌‌ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయి?

– 22(జమ్ములో 10, కాశ్మీర్‌‌లో 10, లడఖ్‌లో 2జిల్లాలున్నాయి)

మతాలవారీగా జమ్ము కాశ్మీర్‌‌లో జనాభా?

–  ముస్లింలు 68.31శాతం, హిందువులు – 28.43, సిక్కులు – 1.87శాతమున్నారు.

‘రూఫ్ ఆఫ్ ది వరల్డ్’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

– లడఖ్

జమ్ము కాశ్మీర్ అధికార భాష?

– ఉర్దూ

ప్రస్తుతం  దేశంలోనే అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతమేది?

– జమ్ము కాశ్మీర్ (రెండో అతిపెద్ద యూటీ లడఖ్)

జమ్ము కాశ్మీర్ విస్తీర్ణమెంత?

– 42, 241 చదరపు కిలోమీటర్లు

లడఖ్ విస్తీర్ణమెంత?

– 59,146 చదరపు కిలోమీటర్లు (మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో 58.33శాతం)

లడఖ్‌లో మొత్తం ఎన్ని జిల్లాలున్నాయి?

– రెండు (లేహ్, కార్గిల్)

లడఖ్‌లో జనాభా ఎంత?

– 2,74,289(మొత్తం రాష్ట్ర జనాభాలో 2.18శాతం)

జమ్ము కాశ్మీర్‌‌లో ఏ సంవత్సరం వరకు లోక్‌సభ నియోజకవర్గాల పెంపు చేయరాదన్న నిబంధన అమలులో ఉంది?

– 2026

ఆర్టికల్ 370 రద్దు చేస్తే తలెత్తే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన కోర్ కమిటీ ఛైర్మన్, సభ్యులెవరు?

– ఛైర్మన్ రవిశంకర్ ప్రసాద్(న్యాయశాఖమంత్రి), న్యాయశాఖ కార్యదర్శి అలోక్ శ్రీవాత్సవ్, హోంశాఖ అదనపు కార్యదర్శి ఆర్‌‌ఎస్ వర్మ, అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా సభ్యులుగా ఉన్నారు.

ఆర్టికల్ 370 రద్దయ్యేవరకు చాప మీదనే నిద్రపోతానని ఏ రాష్ట్రానికి చెందిన మంత్రి శపథం చేశారు?

– రాజస్థాన్‌కు చెందిన మదన్ దిలావర్ (ఈయన 5సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు మంత్రిగా పనిచేశారు)

జమ్ము కాశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందెవరు?

– ఎంఎల్ శర్మ

ఆర్టికల్ 370 రద్దు చేస్తున్న సమయంలో జమ్ము కాశ్మీర్ రాష్ట్ర డీజీపీ ఎవరు?

– దిల్‌బాగ్ సింగ్

జమ్ము కాశ్మీర్‌‌ స్వయం ప్రతిపత్తి రద్దు సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నారు?

– బీవీఆర్ సుబ్రమణ్యం (1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి)

ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ము కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎవరు?

సత్యపాల్ మాలిక్

కేంద్రపాలిత ప్రాంతం అంటే?

– అధికారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దానిని కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణిస్తారు. దీంట్లో అసెంబ్లీ ఉండదు. లెఫ్టినెంట్ గవర్నర్ సాయంతో పాలన సాగుతుంది.

అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమనగా?

– సీఎం, మంత్రివర్గంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న వాటిని అసెంబ్లీతో కూడిన యూటీగా పేర్కొంటారు.

అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతికి ప్రతినిధిగా ఎవరు ఉంటారు?

– లెఫ్టినెంట్ గవర్నర్

ఆర్టికల్ 370 రద్దుకు సహకరించిన పార్టీలేవి?

– బీఎస్పీ, బీజేడీ, అన్నాడీఎంకే, టీడీపీ, టీఆర్‌‌ఎస్, వైసీపీ, ఆప్, శివసేన, శిరోమణి అకాలీదళ్

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పార్టీలు?

– కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ, ఆర్‌‌జేడీ, సీపీఐ, సీపీఎం, జేడీ యూ, ఎస్‌పీ, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్

 

కాశ్మీర్ గురించి ప్రస్తావించిన గ్రంథం?

– కల్హణుడు రాసిన రాజతరంగిణి

కశ్మీరియత్ అనగా?

– ముస్లిం మతంలోని సూఫీతత్వంతో ప్రభావితమైన జీవన విధానం

ఏ ఒప్పందం ప్రకారం జమ్ము కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది?

– అమృత్‌సర్ ఒప్పందం

అమృత్‌సర్ ఒప్పందం ఎవరెవరికి మధ్య కుదిరింది?

– జమ్ము పాలకుడు రాజా గులాబ్‌ సింగ్‌కు, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య

జమ్ము మహారాజైన గులాబ్‌సింగ్ ఏ వంశానికి చెందినవారు?

– డోగ్రా వంశం

గులాబ్ సింగ్ అనంతరం జమ్ము కాశ్మీర్ రాజ్యాధికారాన్ని చేపట్టింది ఎవరు?

– రణబీర్‌‌సింగ్

రాజా హరిసింగ్ ఏ సంవత్సరంలో కాశ్మీర్ పాలన చేపట్టారు?

– 1925

1946 మే నెలలో రాజా హరిసింగ్‌కు వ్యతిరేకంగా ‘క్విట్ కాశ్మీర్‌‌’ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?

– షేక్ అబ్దుల్లా

ఇండియా–పాకిస్థాన్‌లుగా విభజించాలని మౌంట్ బాటన్ ఎప్పుడు ప్రతిపాదించారు?

– 1947 జూన్ 3

స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలోని మొత్తం స్వదేశీ సంస్థానాల సంఖ్య?

– 562

స్వాతంత్ర్యం అనంతరం ఇండియాలో విలీనానికి ఒప్పుకోని సంస్థానాలేవి?

– జమ్ము కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్

జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో తొలి రాజకీయ పార్టీని ఎవరు స్థాపించారు?

– షేక్ అబ్దుల్లా

‘కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్‌’ను షేక్ అబ్దుల్లా ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

– 1932

‘కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్‌’ను ‘నేషనల్ కాన్ఫరెన్స్’గా ఎప్పుడు మార్చారు?

– 1939

షేర్ – ఏ – కాశ్మీర్‌‌గా ఎవరిని పిలుస్తారు?

– షేక్ అబ్దుల్లా

పాకిస్థాన్ ఏ సంవత్సరంలో జమ్ము కాశ్మీర్‌‌పై దండయాత్ర చేసింది?

– 1947 అక్టోబర్ 20

కాశ్మీర్ రాజు ఏ సంవత్సరంలో పాకిస్థాన్‌తో యథాతథ స్థితి ఒప్పందం(స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్) కుదుర్చుకున్నారు?

– 1947

కాశ్మీర్‌‌పై దాడి అనంతరం ఏయే ప్రాంతాలు పాకిస్థాన్ ఆధీనంలో ఉండిపోయాయి?

– గిల్గిట్ – బాల్టిస్థాన్‌ ప్రాంతాలు(పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌లో ఉన్నాయి)

భారత్ – పాక్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్‌వోసీ)ను ఎప్పుడు నిర్ణయించారు?

– 1949 జనవరి 1(అదే రోజు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది)

కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి ఇండియా ఏ సంవత్సరంలో తీసుకెళ్లింది?

– 1948

1947 ఆగస్టు 15 నాటికి జమ్ము కాశ్మీర్ ఒక ప్రత్యేక దేశంగా ఉంది. అప్పుడు కాశ్మీర్‌‌ను ఏ పేరుతో పిలుస్తున్నారు?

– ముల్క్ – ఎ – కాశ్మీర్

 

 

370 రద్దుతో మార్పులు

 

అప్పుడు ఇప్పుడు
ద్వంద్వ పౌరసత్వం ఉండేది ఏక పౌరసత్వం ఉంటుంది
ఇతర రాష్ట్రాలవారు ఆస్తులు, భూములు

కొనకూడదు.

భారతీయ పౌరులెవరైనా

కాశ్మీర్‌‌లో ఆస్తులు కొనుక్కోవచ్చు

అసెంబ్లీ కాలపరిమితి 6ఏళ్లు అసెంబ్లీ కాలపరిమితి ఐదేండ్లు
ప్రత్యేక జెండా ఉండేది ప్రత్యేక జెండా ఉండదు.
మైనారిటీలకు రిజర్వేషన్లు లేవు మైనారిటీలకు 16శాతం రిజర్వేషన్లు
వర్తిస్తాయి.
పంచాయతీలకు హక్కులు, ఉచిత నిర్భంధ విద్య నిబంధన వర్తించవు  పంచాయతీలకు హక్కులతోపాటు, ఉచిత నిర్భంద విద్య నిబంధన అమలవుతుంది.
ఆర్థిక ఎమర్జెన్సీని విధించే ఆర్టికల్ 360, సమాచార హక్కు చట్టం వర్తించవు ఆర్టికల్ 360, సమాచార హక్కు చట్టం వర్తిస్తాయి.