శ్రీకృష్ణునిపై భక్తితో 37వేల మంది మహిళలు ద్వారకలో డ్యాన్స్

శ్రీకృష్ణునిపై భక్తితో 37వేల మంది మహిళలు ద్వారకలో డ్యాన్స్

​ద్వారక అద్భుత ఘట్టానికి వేదికైంది. వేలాది మంది మహిళలు ఒకేచోట సంప్రదాయ నృత్యం చేసి ఔరా అనిపించారు. వేయి రెండువేలు కాదు ఏకంగా 37 వేల మంది మహిళలు, యువతులు శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి డ్రోన్లు కెమెరాల్లో చిత్రీకరించారు.

బ్రహ్మ ముహూర్తంలో 37 వేల మంది మహిళలు కలిసి మహా రాస్' ప్రదర్శించారు. ఈ అందమైన దృశ్యాన్ని  డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. సంప్రదాయానికి చెందిన అద్భుతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మహారాస్ ఆడుతున్న మహిళలకు సంబంధించిన అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. 37 వేల మంది అహిర్ మహిళలు కలిసి రాస్ వాయించి ప్రపంచ రికార్డుని సృష్టించారు.

గుజరాత్‌లోని అహిర్ కమ్యూనిటీకి చెందిన దాదాపు 37 వేల మంది మహిళలు గుజరాత్‌లోని ప్రసిద్ధ ద్వారకా ఆలయంలో జరిగిన మహా రాస్‌లో నృత్య ప్రదర్శనచేశారు. భగవాన్​  శ్రీకృష్ణుని పట్ల భక్తితో  మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. ఈ ప్రదర్శనలో  భారీ సంఖ్యలో మహిళలు .. ఓ  మైదానంలో సెంట్రల్ ప్లాట్‌ఫారమ్ చుట్టూ మహా రాసులను ప్రదర్శించారు. వారు ప్రకాశవంతమైన ఎరుపు సాంప్రదాయ దుస్తులు ధరించారు.   మహా రాస్ అనేది ద్వారకలో బాణాసురుని కుమార్తె .... శ్రీకృష్ణుడి కోడలు అయిన ఉష రెండు రోజులు నిర్వహించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆల్ ఇండియా యాదవ సమాజం ...  అహిరాణి మహిళా మండల్ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారక ఓ మధుర ఘట్టానికి వేదిక అయింది. సుమారు 5 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని కాలంలో చేసిన అతీంద్రియ కర్మలు మరోసారి పునరావృతం చేశారు వేలాది మహిళలు. గుజరాత్ లోని దేవ భూమి ‘ద్వారకా’ ప్రాంగణంలో శ్రీకృష్ణుడిపై భక్తిపారవశ్యంలో మునిగితేలుతూ వేలాది మంది  మహిళలు మహా రాసులను ఆచరించి అహిర్ సంఘం చరిత్ర సృష్టించింది. దేశ విదేశాల్లో నివసిస్తున్న  అహిర్ వర్గానికి చెందిన మహిళలు ద్వారకకు వచ్చి మహా రాస్ ప్రదర్శించారు.