
- గ్రేటర్ వ్యాప్తంగా ఘనంగా సర్వాయి పాపన్న జయంతి
హైదరాబాద్/ముషీరాబాద్/వికారాబాద్/జూబ్లీహిల్స్/మేడ్చల్, వెలుగు: సర్దార్సర్వాయి పాపన్న ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాడారని, జమీందారు, జాగిర్దార్ అరాచకాలను సహించలేక ఖడ్గం చేతబట్టి మొఘలులను ఎదిరించారని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ చెప్పారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాపన్న జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.వి.రమణ, భూపతి వెంకటేశ్వర్లు, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొని పాపన్న ఫొటోకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడుల ఆరాధ్యుడు కాటమయ్య స్ఫూర్తితో వన సంరక్షణ చేపట్టాలని కోరారు. పాపన్న స్ఫూర్తితో గౌడ్లు రాజకీయాల్లో రాణించాలని, అందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టి, ట్యాంక్ బండ్ పైన విగ్రహం నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కైలాబ్ బాబు, ఉడుత రవీందర్, రమేష్, గుమ్మడి రాజు, నరేష్, ఎం కృష్ణ స్వామి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ సర్వాయి పాపన్న ఫొటోకు అధికారులతో కలిసి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సర్వాయి పాపన్న విగ్రహాలకు స్థానిక నేతలు, సంఘాల నాయకులు నివాళులర్పించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్అనుదీప్, మేడ్చల్కలెక్టరేట్లో నుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కేశురాం నాయక్ అధికారులతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.