హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల బీఈడీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్–2022 ఈ నెల 26న నిర్వహిస్తున్నట్టు ఎడ్ సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ చెప్పారు. అదే రోజు మూడు సెషన్లలో ఎగ్జామ్ జరుగుతుందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 38,091 మంది హాజరు కానున్నారని, 39 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరిగే మొదటి సెషన్‌కు 12,634 మంది, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు జరిగే రెండో సెషన్‌కు 12,732 మంది, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగే మూడో సెషన్‌కు 12,725 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు.
