ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడో విడతలో 3,814 నామినేషన్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడో విడతలో 3,814 నామినేషన్లు
  • ఉమ్మడి జిల్లాలో సర్పంచ్​స్థానాలకు దాఖలైన నామినేషన్లు
  • వార్డులకు 12,149... 

నల్గొండ, వెలుగు: ఉమ్మడి జిల్లాలో మూడో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 3,814, వార్డు స్థానాలకు 12,149 నామినేషన్లు వచ్చాయి. అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. హుజూర్​నగర్, దేవరకొండ, మునుగోడు, ఆలేరు నియోజకవర్గాల్లో చివరగా మిగిలిన పంచాయతీలకు నామినేషన్లు తీసుకున్నారు. ఆదివారం అభ్యంతరాలు స్వీకరించి, సోమవారం పరిష్కరించనున్నారు. 9న నామినేషన్ల ఉపసంహరణ.. అదేరోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.

మూడో విడత పంచాయతీలు

సూర్యాపేట జిల్లాలో 146, నల్గొండ జిల్లాలో 269, యాదాద్రి జిల్లాలో 124 పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.  

దాఖలైన నామినేషన్ల వివరాలు.. 

నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్​ లోని 269 పంచాయతీలకు గానూ 1,962 మంది, 2,206 వార్డులకు 5,606 మంది నామినేషన్ ​వేశారు. చందంపేట మండలంలోని పంచాయతీలకు 227, చింతపల్లిలో 207, దేవరకొండలో 318, గుడిపల్లిలో103, డిండిలో 271, గుర్రంపోడులో 278, కొండమల్లేపల్లిలో 190, నేరేడుగొమ్ములో 178, పీఏపల్లి మండలంలో 190 నామినేషన్లు వచ్చాయి. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ డివిజన్ పరిధిలో 146 పంచాయతీలకు గానూ 1,052 మంది, 1,318 వార్డులకు 3,493 మంది నామినేషన్​దాఖలు చేశారు. 

మేళ్లచెర్వు మండలంలో 82, చింతలపాలెంలో 113, గరిడేపల్లిలో 228, నేరేడుచర్లలో 19, పాలకీడులో 166, హుజూర్​నగర్​లో 76, మఠంపల్లిలో 255 మంది నామినేషన్​వేశారు. మునుగోడు, ఆలేరు నియోజకవర్గాల్లోని 124 పంచాయతీలకు గానూ 800 నామినేషన్లు, 1,086 వార్డు స్థానాలకు 3,050 నామినేషన్లు వచ్చాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పుల్ మండలంలో 148, నారాయణపూర్​లో 201, అడ్డగూడూరులో 111, మో త్కూరులో 90, గుండాలలో 126, మోటకొండూరు మండలంలో 124 మంది నామినేషన్​ వేశారు.1,086వార్డులకు 3,050 నామినేషన్లు వచ్చాయి.