- తాండూరులో 28 మంది, కొడంగల్‌లో 2 స్థానాల్లో అభ్యర్థులు యునానిమస్
- సీఎం నియోజకవర్గంలో అంతా ‘కాంగ్రెస్సే’
వికారాబాద్, వెలుగు:వికారాబాద్ జిల్లాలో మొదటి విడతలో ఇప్పటివరకు 39 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తాండూర్‌లో 26 గ్రామాలు ఉండగా, తాండూర్ మండలంలో కరణ్ కోట్, రాంపూర్ తండా, వీరారెడ్డిపల్లి, బిజ్వార్, చిట్టి ఘనపూర్, యాలాల మండలంలో లక్ష్మీ నారాయణపూర్, గంగాసాగర్, దేవుల తండా, సంగం కుర్దు, కిష్టాపూర్, జక్కయ్యపల్లి, సంగాయి గుట్ట తండా, పేరుకంపల్లి తండా, బండమీదిపల్లి, రేలగడ్డ తండా, సంగాయిపల్లి తండా, పెద్దేముల్ మండలంలోని రుద్రారం, చైతన్య నగర్, దుర్గాపూర్, సిద్దన్నమడుగు తండా, బషీరాబాద్ మండలంలోని మంతన్ గౌడ్, బాబు నాయక్ తండా, అనికా నాయక్ తండా, బద్లాపూర్, కోట్‌పల్లి మండలంలోని లింగంపల్లి, బుగ్గాపూర్జీపీల్లో సర్పంచ్ స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. తాండూర్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎంపికైన అభ్యర్థుల్లో 26 మంది కాంగ్రెస్మద్దతుదారులు కాగా, ఒకరు బీజేపీ మద్దతుదారులు ఉన్నారు.
అంతా కాంగ్రెస్ మద్దతుదారులే..
వికారాబాద్జిల్లాలోని సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్నియోజకవర్గంలో అందరూ కాంగ్రెస్మద్దతుదారులే సర్పంచ్‌లుగా ఏకగ్రీవమయ్యారు. కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్మండలాల్లోని 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కొడంగల్ మండలంలో టేకులకోడ్ రాజు, బొంరాస్‌పేట మండలంలో సలిండాపూర్, మదనపల్లి తండా, జానకంపల్లి, నాగిరెడ్డిపల్లి, కట్టుకాలువ తండా, తెకులగడ్డ తండా-, పాలబావి తండా, దౌల్తాబాద్ మండలంలో బండివాడ -, తిమ్మాయిపల్లి, నాగసార్ , దుద్యాల్ మండలంలో సంగైపల్లిల్లో సర్పంచ్అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కొడంగల్నియోజకవర్గంలో ఏకగ్రీవమైన సర్పంచ్అభ్యర్థులందరూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కావడం గమనార్హం..
రంగారెడ్డి జిల్లాలో ఆరు సర్పంచులు ఏకగ్రీవం
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో ఆరు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో షాద్ నగర్, రాజేంద్ర నగర్ డివిజన్లోని 174 సర్పంచ్, 1530 స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనుండగా.. అధికారులు నవంబర్ 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. నవంబర్ 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ పూర్తయ్యింది. సర్పంచ్ స్థానాలకు వచ్చిన నామినేషన్లలో 310 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు స్థానాలకు 612 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు.
సర్పంచ్ స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1340 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
5 స్థానాల్లో సర్పంచులతో పాటు వార్డులు కూడా..
జిల్లాలోని ఫరూక్ నగర్, కేశంపేట, నందిగామ మండలంలో ఒక్కో గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా, కొందుర్గు మండలంలో మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కేశంపేట మండలంలోని దేవునిగుడి తండాలో (కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి ) సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్లు అందరూ ఏకగ్రీవమయ్యారు.
కొందుర్గు మండలంలో చెరుకుపల్లిలో (కాంగ్రెస్మద్దతు తెలిపిన అభ్యర్థి), అలాగే పాత అగిర్యాల (కాంగ్రెస్మద్దతు తెలిపిన అభ్యర్థి), లక్ష్మీదేవునిపల్లి (కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి ) , నందిగామ మండలంలోని కన్హా (కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి ) గ్రామాలు కూడా సర్పంచ్‌లతో పాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫరూక్నగర్మండలంలోని అయ్యవారిపల్లి (కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి ) సర్పంచు స్థానం ఏకగ్రీవమైంది.
190 వార్డులు ఏకగ్రీవం
జిల్లాలో మొత్తం 190 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఇందులో ఫరూక్నగర్మండలంలోని 59 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, అతి తక్కువగా నందిగామ మండలంలో 11 వార్డు స్థానాలు , చౌదరిగూడ మండలంలో 31, కేశంపేటలో 25, కొందుర్గులో30, కొత్తూరులో 22, శంషాబాద్ మండలంలో 12 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
