హైదరాబాద్, వెలుగు: డిజిటల్ ఇన్సూరెన్స్ సంస్థ జునో జనరల్ ఇన్సూరెన్స్ 2026–-27 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 39 శాతం ప్రీమియం వృద్ధిని సాధించింది. ఈ రెండు రాష్ట్రాల్లో వాహన వినియోగం పెరగడం, డిజిటల్ సేవలకు ఆదరణ లభించడమే ఈ వృద్ధికి కారణమని కంపెనీ తెలిపింది.
కస్టమర్లకు మరింత మెరుగైన మోటార్ ఇన్సూరెన్స్ సేవలు అందించేందుకు భాగస్వామ్యాలను విస్తరిస్తున్నామని చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీఓ) జాక్సన్ జాకబ్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పూజా యాదవ్ వెల్లడించారు. తమ కంపెనీ 2018లో కార్యకలాపాలు ప్రారంభించిందని, కస్టమర్ల సంఖ్య 80 లక్షలకు చేరిందని వివరించారు.
