వయస్సు 39.. దొంగతనాలు 69.. దొంగ అరెస్ట్.. 42.3 తులాల బంగారం, 87 తులాల వెండి స్వాధీనం

వయస్సు 39.. దొంగతనాలు 69.. దొంగ అరెస్ట్.. 42.3 తులాల బంగారం, 87 తులాల వెండి స్వాధీనం

ఎల్బీనగర్, వెలుగు: పగటి పూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను హయత్‌‌‌‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 42.3 తులాల బంగారం, 87 తులాల వెండి, రూ.42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లకు చెందిన శ్రీరామ్ నరసింహచారి అలియాస్ నయామి అలియాస్ రాజేశ్(39) ఏడో తరగతి వరకు చదివి కార్పెంటర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయం సరిపోక దొంగతనాలు ప్రారంభించాడు. ఇప్పటివరకు నగరంలో 65, ఇతర జిల్లాల్లో నాలుగు చోరీలు చేశాడు. మంగళవారం మునగానూరులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.