బర్త్ డే పార్టీలో కాల్పులు.. అమెరికాలో నలుగురు మృతి 

బర్త్ డే పార్టీలో కాల్పులు.. అమెరికాలో నలుగురు మృతి 

వాషింగ్టన్ : అమెరికాలోని ఓ బర్త్  డే పార్టీలు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి నలుగురిని చంపేశారు. 20 మందిని గాయపరిచారు. అలబామా రాష్ట్రంలోని డేడ్ విల్లె అనే చిన్న పట్టణంలో శనివారం ఈ ఘోరం జరిగింది. టౌన్ లోని ఓ డాన్స్ స్టూడియోలో ఓ టీనేజీ అమ్మాయి తన 16వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది.

ఈ కార్యక్రమానికి ఆమె ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇంతలోనే గుర్తుతెలియని వ్యక్తులు అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు.  స్పాట్ లోనే నలుగురు చనిపోగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ కాల్పుల్లో ఎంత మంది పాల్గొన్నారో తెలియరాలేదని, దుండగుల కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.