
ప్రకాశం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొనకమిట్ల మండలం కొత్తపల్లి దగ్గరలో కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతులంగా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ప్రమాదానికి గురైన కారు,లారీనీ పోలీసులు పక్కకు తీసేయడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.