
- నలుగురు మృతి,ఇద్దరికి తీవ్ర గాయాలు
- దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని డార్విన్‌లో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డార్విన్‌లోని ఓ హోటల్‌లో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కొద్దిరోజుల క్రితమే పెరోల్‌పై జైలు నుంచి బయటికి వచ్చాడని, దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఘటనను టెర్రర్ అటాక్‌గా భావించట్లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. హోటల్‌లోని ప్రతి గదిలోకి వెళ్లిన దుండగుడు ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరిపి, కారులో పారిపోయాడని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.