
- ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల మందికి ఫుల్ టైమ్ జాబ్ లు పోతయ్
- సెకండ్ వరల్డ్ వార్ కన్నా దారుణమైన సంక్షోభమన్న ఐఎల్ఓ
కరోనా కారణంగా మన దేశంలో 40 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోతారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) హెచ్చరించింది. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్ లో ప్రపంచ వ్యాప్తంగా 19.5 కోట్ల మంది ఫుల్ టైమ్ జాబ్ లు కోల్పోతారని లిపింది. కరోనాతో ప్రపంచంలో ఏర్పడిన సంక్షోభం సెకండ్ వరల్డ్ వార్ కన్నా దారుణంగా ఉందని చెప్పింది. ‘ఐఎల్ఓ మానిటర్ సెకండ్ ఎడిషన్ – కొవిడ్ 19 అండ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్ఠ్ ‘ పేరుతో రిలీజ్ చేసిన రిపోర్టులో ఈ వివరాలు వెల్లడించింది.
ఇప్పటికే మొదలైన ప్రభావం
అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వర్కర్లకు ఇబ్బందులు తప్పవని ఐఎల్ఓ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ ఫార్మల్ సెక్టార్ లో 200 కోట్ల మంది పని చేస్తున్నారని, వారికి రిస్క్ ఎక్కువగా ఉందని ఇప్పటికే ఇండియా, నైజీరియా, బ్రెజిల్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ కారణంగా వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారంది. ఫుడ్ సర్వీసులు, అకమడేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ ఇతర సెక్టార్లలో పని చేసేవారు జాబ్ లు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని అంచనా వేసింది. అమెరికాలో 50 లక్షలు, యూరప్ లో 1.2 కోట్లు, ఆసియా పసిఫిక్ లో 12.5 కోట్ల ఫుల్ టైమ్ వర్కర్స్ జాబ్ లు కోల్పోతారని చెప్పింది.
అన్ని దేశాలకు ఇదో పెద్ద పరీక్ష: గుయ్ రైడర్
‘ప్రపంచదేశాలకు ఇదో పెద్ద పరీక్ష. ఒక దేశం ఫెయిలైతే, అన్ని దేశాలు ఫెయిలైనట్లే. అన్ని సెగ్మెంట్లలో సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది’ అని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గుయ్ రైడర్ అన్నారు.