మీరు మనుషులేనా:  కోతులకు విషం ఇచ్చి చంపారు..

మీరు మనుషులేనా:  కోతులకు విషం ఇచ్చి చంపారు..

ఉత్తరప్రదేశ్‌లో కోతుల మృతి కలకలం రేపింది. హాపూర్ జిల్లాలో మే 14వ తేదీ ఆదివారం దాదాపు 40 కోతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన హాపూర్‌లోని గర్హ్‌ముక్తేశ్వర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మే 15వ తేదీ సోమవారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోతులు చనిపోయి పడి ఉన్న ప్రదేశానికి సమీపంలో బెల్లం, పుచ్చకాయలను స్థానికులు గుర్తించారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కోతులకు విషం ఇచ్చి చంపి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు, అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కేసు నమెదు చేసుకున్న పోలీసులు కోతుల మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కోతులకు విషం ఇచ్చి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోతుల మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. శవపరీక్ష పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది.