తెలంగాణ‌లో మ‌రో 40 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో మ‌రో 40 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా మ‌రో 40 క‌రోనా పాజిటివ్ కేసుల న‌మోద‌య్యాయి. అందులో 33 కేసులు జీహెచ్ఎంసీ ప‌రిధిలోనేవే. అయితే కొద్ది రోజులుగా వ‌ల‌స కూలీల్లో క‌రోనా కేసులు వ‌స్తుండ‌గా.. ఇవాళ కొత్త‌గా ఏడుగురు వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు సంఖ్య 1454కి చేరింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1454 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో 34 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది. అలాగే చికిత్స త‌ర్వాత పూర్తిగా న‌య‌మై ఇవాళ కొత్త‌గా ఏడుగురు డిశ్చార్జ్ కావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 959కి చేరింద‌ని వెల్ల‌డించింది ఆరోగ్య శాఖ‌. ప్ర‌స్తుతం 461 మంది ఆస్ప‌త్రుల్లో క‌రోనాతో చికిత్స పొందుతున్నార‌ని చెప్పింది.

14 రోజుల్లో 26 జిల్లాల్లో కొత్త కేసులు సున్నా

రాష్ట్రంలో యాదాద్రి, వ‌న‌ప‌ర్తి, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని తెలిపింది రాష్ట్ర ఆరోగ్య శాఖ‌. అలాగే 26 జిల్లాల్లో గ‌డిచిన 14 రోజులుగా కొత్త కేసులు రాలేద‌ని చెప్పింది.

  1. క‌రీంన‌గ‌ర్
  2. సిరిసిల్ల‌
  3. కామారెడ్డి
  4. మ‌హ‌బూబ్ న‌గ‌ర్
  5. మెద‌క్
  6. భూపాల‌ప‌ల్లి
  7. సంగారెడ్డి
  8. నాగ‌ర్ క‌ర్నూల్
  9. ములుగు
  10. పెద్ద‌పెల్లి
  11. సిద్దిపేట‌
  12. మ‌హబూబాబాద్
  13. మంచిర్యాల‌
  14. భ‌ద్రాద్రి
  15. వికారాబాద్
  16. న‌ల్ల‌గొండ‌
  17. ఆసిఫాబాద్
  18. ఖ‌మ్మం
  19. నిజామాబాద్
  20. ఆదిలాబాద్
  21. సూర్యాపేట్
  22. నారాయ‌ణ‌పేట్
  23. వ‌రంగ‌ల్ అర్బ‌న్
  24. జ‌న‌గామ
  25. నిర్మ‌ల్
  26. గ‌ద్వాల్