హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా చలి పెరుగుతున్న నేపథ్యంలో ఎవ్రీడే ఎసెన్షియల్స్ వింటర్ వెల్నెస్ ఉత్పత్తులపై 40 శాతం వరకు డిస్కౌంట్ఇస్తున్నామని ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది. ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణ, కిరాణా, శిశు సంరక్షణ, పెంపుడు జంతువుల సంరక్షణ విభాగాలలో ఈ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. డాబర్ చ్యవన్‌ప్రాశ్, ఝండు కేసరీ జీవన్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన సీడ్ మిక్స్‌లు, గ్రీన్ టీలను తక్కువ ధరలకు కొనొచ్చని తెలిపింది.
శిశు సంరక్షణ కోసం మదర్ స్పర్ష్ లోషన్, ఫిలిప్స్ అవెంట్ పంప్ వంటి ప్రీమియం వస్తువులు ఉన్నాయి. జంతువులకు వెచ్చదనం కోసం ప్రత్యేక కోట్లు జాకెట్లు డిస్కౌంట్ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే ద్వారా అదనపు తగ్గింపులు, ప్రైమ్ సభ్యులకు ఫాస్ట్ డెలివరీ వంటి సౌకర్యాలు పొందవచ్చని తెలిపింది.
