40 శాతం పెరిగిన యాక్సిక్​ బ్యాంక్​ లాభం

40 శాతం పెరిగిన యాక్సిక్​ బ్యాంక్​ లాభం

న్యూఢిల్లీ: యాక్సిక్​బ్యాంక్​ ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో రూ.5,797 కోట్ల లాభం సంపాదించింది. గత సంవత్సరం జూన్​ క్వార్టర్​ లాభం రూ.4,125 కోట్లతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ.21,657 కోట్ల నుంచి రూ.30,644 కోట్లకు పెరిగింది. 

వడ్డీ ఆదాయం రూ.18,729 కోట్ల నుంచి రూ.25,557 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం పెరిగి రూ.11,959 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్​ 3.6 శాతం నుంచి 4.10 శాతానికి పెరిగింది. కన్సాలిడేటెడ్​ పద్ధతిలో యాక్సిస్​ బ్యాంకు తాజా క్వార్టర్​లో రూ.6,099 కోట్ల లాభం సంపాదించింది. గత ఏడాది క్యూ1లో రూ.4,389 కోట్లు వచ్చాయి.