
తెలంగాణలో సొమవారం కొత్తగా మరో 41 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 26 జీఎచ్ఎంసీ పరిధిలో, 3 మేడ్చెల్ జిల్లాలో రాగా.. 12మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1592కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో 34 మంది మరణించగా.. ఇప్పటి వరకు 1002 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 556 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.