లారీలో 424 కేజీల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్ట్

లారీలో 424 కేజీల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్ట్
  • పరారీలో మరో ఇద్దరు 
  • రూ. 2.12 కోట్లకు పైగా విలువైన గాంజా స్వాధీనం
  • భద్రాద్రి జిల్లా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను 

టేకులపల్లి, వెలుగు:  లారీలో గంజాయిని తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  సీసీఎస్, టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల వద్ద సుమారు రూ.2.13కోట్ల విలువైన 424.95 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను శుక్రవారం మీడియాకు వివరాలు తెలిపారు. జిల్లాలోని టేకులపల్లి మండలం వెంకట్యాతండా సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా లారీని ఆపి చెక్ చేయగా క్యాబిన్ సీట్ల కింద భారీగా గంజాయి ప్యాకెట్లు దొరికాయి. 

లారీలోని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా..  ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి రాజస్థాన్​కు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితులు ప్రభులాల్ గుర్జర్, శివరాజ్ గుర్జర్ అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు రాంబాబు, నారాయణ గుర్జర్ పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ఐ రాజేందర్, బోడ్ ఎస్ఐ శ్రీకాంత్, సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.