ఇండియాకో దండం : దేశం విడిచి వెళ్లిపోతున్న డబ్బున్నోళ్లు.. 2024లో ఎంత మంది అంటే..?

ఇండియాకో దండం : దేశం విడిచి వెళ్లిపోతున్న డబ్బున్నోళ్లు.. 2024లో ఎంత మంది అంటే..?

భారత్ నుంచి కుబేరులు క్యూ కట్టి మరీ విదేశాలకు వెళ్లిపోతున్నారు. 2024 సంవత్సరంలో దాదాపు 4వేల 300 మంది మిలియనీర్లు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టున్సీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ అంచనా వేసింది. వీరిలో ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశానికి వెళ్లడానికి ఇష్టపడుతున్నారని ఈ సంస్థ చేసిన సర్వేలో తేలింది. 2023 సంవత్సరంలో అత్యధిక నికర సంపద ఉన్న 5వేల 100 మంది భారత్ ను విడిచిపెట్టి వెళ్లారు. 


ఒక మినియన్ డాలర్లు( రూ.8.34 కోట్ల ఆస్తి ) ఉన్నవారు మిలియనీర్లు, HNWIలు గా పరిగణిస్తారు.  మిలియనీర్ల వలసల్లో అమెరికా, చైనా, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2024 చివరి నాటికల్లా 6వేల 700 మంది మిలియనీర్లు UAE వెళ్లనున్నారని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ రిపోర్ట్ చెబుతుంది. అక్కడ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడాని గోల్డెన్ వీసా, అవస్థాపనా సౌకర్యాలు, పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు బాగా ఉన్నాయి. ఇన్వెస్ట్ మెంట్లతో పౌరసత్వం పొందిన వారిలో భారతీయులు ఎక్కువమందే ఉన్నారు.

కరేబియన్‌లో, ఆంటిగ్వా, బార్బుడా మరియు కెనడా దేశాల ఇన్వెస్ట్ మెంట్ ప్రొగ్రామ్ ల ఇండియా బిజినెస్ మ్యాన్లను ఆకర్శిస్తున్నాయి. వ్యాపార అవకాశాలు, ఆకర్షణీయమైన జీవనశైలి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, వారి పిల్లలకు విద్యావకాశాలు వంటి అంశాలు బిలియనీర్లు వలస వెళ్లడానికి కారణమని  హెన్లీ & పార్ట్‌నర్స్  సంస్థ చెప్పింది. 

మిలియనీర్స్ ని ఆకర్శించే టాప్ 10 దేశాలివే..

UA E    +6,700
USA                +3,800
సింగపూర్    +3,500
కెనడా    +3,200
ఆస్టేలియా    +2,500
ఇటలీ    +2,200
స్విర్జర్లాండ్    +1,500
గ్రీస్    +1,200
పోర్చుగల్    +800
జపాన్    +400