పంచాయతీ ఎన్నికల్లో 432 కేసుల నమోదు : సీపీ విజయ్ కుమార్

పంచాయతీ ఎన్నికల్లో 432 కేసుల నమోదు :  సీపీ విజయ్ కుమార్
  •     సీపీ విజయ్ కుమార్

సిద్దిపేట రూరల్, వెలుగు: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 432 కేసులు నమోదు చేసినట్లు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. అందులో 271 మద్యం కేసులు నమోదవ్వగా 5,181.41 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఆ మద్యం విలువ సుమారు రూ. 37,89,530 ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న ఉచితాల కేసులు 35 నమోదు కాగా రూ. 2,29,560 విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు. 

సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్నరూ. 30,36,620 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమతి లేని ర్యాలీల నిర్వహణపై 27 కేసులు, పటాకులు కాల్చడంపై 15 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా 2,729 మందిని అధికారుల ముందు బైండోవర్ చేసినట్లు వెల్లడించారు.