2023 లో 7 సిటీల్లో పూర్తయిన ఇండ్లు 4.35 లక్షలు

2023 లో 7 సిటీల్లో పూర్తయిన ఇండ్లు 4.35 లక్షలు
  •     8 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ : అనరాక్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: కిందటేడాది దేశంలోని టాప్ ఏడు సిటీలలో 4.35 లక్షల ఇండ్లను డెవలపర్లు పూర్తి చేశారని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ పేర్కొంది. పూర్తయిన ఇండ్లలో 8 శాతం గ్రోత్ నమోదు అయ్యిందని  తెలిపింది. 2022 లో  4.02 లక్షల యూనిట్లు పూర్తయ్యాయి. ఫస్ట్ సేల్ ట్రాన్సాక్షన్ల డేటా ఆధారంగా ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను అనరాక్ తయారు చేసింది. 

ఈ రిపోర్ట్ ప్రకారం,  ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లో కిందటేడాది 1,43,500 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. అంతకు ముందు ఏడాదిలో పూర్తయిన 1,26,720 ఇండ్లతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. ఢిల్లీ–ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూర్తయిన ఇండ్లు 86,300 యూనిట్ల నుంచి 32 శాతం పెరిగి 1,14,280 యూనిట్లకు ఎగశాయి. 

బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, చెన్నై మూడు సిటీలలో కలిపి కిందటేడాది 87,190 ఇండ్లు పూర్తయ్యాయి. 2022 లో ఈ నెంబర్ 81,580 గా రికార్డయ్యింది. పూణెలో   కిందటేడాది పూర్తయిన ఇండ్లు 84,200 యూనిట్లకు పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం  23 శాతం గ్రోత్ నమోదు చేసింది.  కోల్‌‌‌‌‌‌‌‌కతాలో 25,075 ఇండ్లు కిందటేడాది పూర్తయ్యాయి.