ప్రిసింప్టొమేటిక్ దశలో 44 శాతం మందికి వైరస్ అంటింది

ప్రిసింప్టొమేటిక్ దశలో 44 శాతం మందికి వైరస్ అంటింది
  • చైనా స్టడీ వెల్లడి

బీజింగ్: చైనాలో కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల్లో 44 శాతం మందికి.. జలుబు, జ్వరం, దగ్గు వంటి ఎలాంటి లక్షణాలు లేని కరోనా పాజిటివ్ వ్యక్తుల నుంచే సోకిందని ఓ స్టడీలో తేలింది. కరోనా సోకిన తర్వాత రెండు మూడు రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించని వారి నుంచే ఇతరులకు వైరస్ స్ప్రెడ్ అయిందని గ్వాంగ్జౌలోని ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబొరేటరీ రీసెర్చ్ ప్రతినిధులు వెల్లడించారు. గ్వాంగ్జౌ ఆస్పత్రిలో ఒక రోజులోనే 94 మంది ఎలాంటి లక్షణాలు లేకుండా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన తర్వాత రోజు ఈ రీసెర్చ్ బయటికొచ్చింది. ఒక వ్యక్తి నుంచి వైరస్ మరొకరికి సోకినప్పుడు.. లక్షణాలు రావడానికి రెండు మూడ్రోజులు పడుతుందని, దీనినే ప్రిసింప్టొమాటిక్ దశ అని చెప్పారు. ఆలోపే సదరు వ్యక్తులను కాంటాక్ట్ అయిన వారికి వైరస్ విస్తరిస్తుందని అంటున్నారు. ప్రిసింప్టొమాటిక్ దశలోనే ఇండెక్స్ కేసుల నుంచి చాలా మందికి సెకండరీ కాటాక్ట్ పర్సన్స్ కు వైరస్ సోకిందని, ఇప్పుడున్న మొత్తం కేసుల్లో 44 శాతం మంది అలా సోకినవారేనని చెప్తున్నారు. ప్రిసింప్టొమాటిక్ ట్రాన్స్ మిషన్ ను కంట్రోల్ చేసేందుకు హోం క్వారంటైన్ లో కాకుండా సపరేట్​గా మరో ప్లేస్ లో ఐసోలేషన్​లో ఉంచాలని వారు సూచిస్తున్నారు. ప్రిసింప్టోమాటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా సింగపూర్​లో 48%, 62% మంది టియాంజిన్లకు వైరస్ సోకిందని అంచనా వేశారు.