4.5 కోట్ల మంది రెస్టారెంట్లలో తిన్నరు

4.5 కోట్ల మంది రెస్టారెంట్లలో తిన్నరు

న్యూఢిల్లీ: కిందటేడాది అంటే 2021లో దేశంలోని 4.5 కోట్ల మంది తమ ఫేవరెట్ రెస్టారెంట్లలో ఫుడ్​ తిన్నారు. ఇలా తిన్నవారిలో ఎక్కువ మంది ఢిల్లీవాసులే ఉన్నారని ఒక రిపోర్టు వెల్లడించింది. ఫుడ్​ తినడానికి రెస్టారెంట్లలో సగటున రూ. 2,670 బిల్లును చెల్లించినట్లు డైన్​అవుట్​ ఈ రిపోర్టులో తెలిపింది. అంతకు ముందు ఏడాది ఈ బిల్లు సగటున రూ. 1,907 గా ఉంది. తమ ద్వారా టేబుల్​ బుక్​ చేసుకోవడం వల్ల రూ. 1,360 కోట్లు ఆదా అయిందని ఈ రెస్టారెంట్​ టెక్​ ప్లాట్​ఫామ్​ వెల్లడించింది. 2021లో మొత్తం 8,588 టేబుల్స్​ బుక్​ చేసినట్లు పేర్కొంది. వరసగా మూడోసారి ఢిల్లీనే డైనింగ్​ క్యాపిటల్​ ఆఫ్ ఇండియా గా నిలిచిందని, మొత్తం డైనర్లలో 32 శాతం మంది ఈ సిటీ వాళ్లేనని తెలిపింది. 18 శాతం డైనర్లతో బెంగళూరు సిటీ రెండో ప్లేస్​లో నిలిచింది. బట్టర్​ చికెన్​, దాల్​ మక్ని, నాన్​లను 38 శాతం మంది ఇష్టపడ్డారని, చైనీస్​ ఫుడ్​ను 18 శాతం, కాంటినెంటల్​ఫుడ్​ను 16 శాతం మంది డైనర్లు కావాలనుకున్నారని డైన్​ అవుట్​తన రిపోర్టులో పేర్కొంది. ప్రజల ఆదాయాలు భారీగా పెరగడంతోపాటు, వర్క్​ ఫ్రం హోమ్​ లైఫ్​ స్టైల్​ వల్లా లగ్జరీ డైనింగ్​ దేశంలో జోరందుకుందని, ఇది 120 శాతం పెరిగిందని, ఫైన్​ డైనింగ్​ 105 శాతం ఎక్కువైందని వివరించింది. డిసెంబర్​ నెలలో 50 వేల లీటర్ల ఆల్క​హాల్​ వినియోగంతో బెంగళూరు 2021లో లిక్కర్​ క్యాపిటల్​ ఆఫ్​ ఇండియాగా నిలిచినట్లు పేర్కొంది. దేశంలోనే టాప్​ ఈటింగ్​ అవుట్​ లొకేషన్​గా ఢిల్లీలోని కన్నాట్​ప్లేస్​ నిలవగా, ఆ తర్వాత ప్లేస్​లో ముంబైలోని లోయర్​ పరేల్​, బెంగళూరులోని వైట్​ఫీల్డ్​లు నిలిచినట్లు డైన్​అవుట్​ ఈ రిపోర్టులో తెలిపింది. కరోనా వల్ల అంతకు ముందు ఏడాది పెద్దగా ఇల్లు కదలకపోవడంతో,  2021లో  సగటు  ఫుడ్​బిల్లు ఏకంగా 40 శాతం పెరిగింది.  డైన్​ అవుట్​ కో ఫౌండర్​ అంకిత్​ మెహ్రోత్రా చెప్పారు. తమ ద్వారా టేబుల్స్​ బుక్​ చేసుకోవడం వల్ల చాలా మంది డైనర్లకు డబ్బు ఆదా అయిందని పేర్కొన్నారు. 4 స్టార్​ ప్లస్​ రేటింగ్​ ఉన్న రెస్టారెంట్లలోనే  73.5 శాతం ట్రాన్సాక్షన్లు జరిగాయని వివరించారు.