రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

భారతదేశంలో కరోనా కేసులు ఇంకా రికార్డు అవుతూనే ఉన్నాయి. గడిచిన  24  గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,070  కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 43,469,234కి చేరుకుంది. మరో 23 మంది కరోనాతో మృతి చెందారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పెరుగుతున్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తెలంగాణలో 24 గంటల్లో 462 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 403 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 01, 406 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 98.90 శాతంగా ఉందని, మొత్తం 25 వేల 518 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించింది. 

జిల్లాల వారీగా కేసులు :-
ఆదిలాబాద్ 04, భద్రాద్రి కొత్తగూడెం 03, హైదరాబాద్ 259, జగిత్యాల 02, జనగాం 01, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 01, కామారెడ్డి 02, కరీంనగర్ 09, ఖమ్మం 15, కొమరంభీం ఆసిఫాబాద్ 02, మహబూబ్ నగర్ 05, మహబూబాబాద్ 02, మంచిర్యాల 10, మెదక్ 02, మేడ్చల్ మల్కాజ్ గిరి 40, ములుగు 08, నాగర్ కర్నూలు 00, నల్గొండ 09, నారాయణపేట 03, నిర్మల్ 00, నిజామాబాద్ 07, పెద్దపల్లి 02, రాజన్న సిరిసిల్ల 00, రంగారెడ్డి 35, సంగారెడ్డి 15, సిద్ధిపేట 07, సూర్యాపేట 03, వికారాబాద్ 00, వనపర్తి 02, వరంగల్ రూరల్ 02, హన్మకొండ 03, యాదాద్రి భువనగరి 09. మొత్తం : 462