ఆంధ్రప్రదేశ్ లో 48 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో 48 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన  కరోనా టెస్టుల్లో 48  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ  తెలిపింది. అదే సమయంలో 86 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ప్రకటించింది. రాష్ట్రంలో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,137కి చేరిందని చెప్పింది.

ఏపీలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 12,  కృష్ణాలో 3, కర్నూలులో 7 చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ.